కలం, వెబ్ డెస్క్: ఆంధ్ర ప్రదేశ్ లో ఎంపీటీసీ (MPTC Elections) , జెడ్పిటీసీ (ZPTC Elections) ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ మేరకు నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనిల్‌చంద్ర పునేఠా విడుదల చేశారు. ఈ నెల 21 నుంచి 23 వరకు ఎన్నికల అధికారులు నామినేషన్లను స్వీకరించనున్నారు. 28 జిల్లాల ప్రజా పరిషత్ లు, 659 జిల్లా పరిషత్ లకు, 9,829 ఎంపీటీసీలకు నోటిఫికేషన్ విడుదలైంది.
అక్టోబర్ 24న అధికారులు నామినేషన్లను పరిశీలించనున్నారు. అక్టోబర్ 27న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. నవంబర్ 3న ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు ఎంపీటీసీ అభ్యర్థులకు రూ. 4 లక్షలు, జెడ్పిటీసీ అభ్యర్థులకు రూ. 8 లక్షలుగా నిర్ణయించారు. జడ్పీ చైర్మన్ పదవులకు నేరుగా ఎన్నిక ఉంటుంది.

