కలం, కరీంనగర్: శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్లోని అలుగునూరు వద్ద ఉన్న శ్రీ రాజేశ్వరి దేవి అమ్మవారి ఆలయాన్ని (Rajeshwari Devi Temple) మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కుటుంబ సమేతంగా సందర్శించి, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని శ్రీ రాజేశ్వరి దేవి అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

