కలం, కరీంనగర్: హుస్నాబాద్ (Husnabad) నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలో బంజారా భవన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ అక్కన్నపేట సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బాణోతు వెంకట్‌తో పాటు పలువురు బంజారా నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ను కలిశారు. కరీంనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నంను వారు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అక్కన్నపేట (Akkannapeta) మండలంలో బంజారా భవన్ నిర్మాణం ఆవశ్యకతను మంత్రికి వివరించి, బంజారా సామాజిక వర్గ ప్రజలకు ఉపయోగపడేలా భవన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. బంజారా ప్రజల సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సమావేశాలు నిర్వహించుకోవడానికి బంజారా భవన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)ను కలిసి తమ విజ్ఞప్తిని తెలియజేసిన వారిలో అక్కన్నపేట సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బాణోతు వెంకట్‌తో పాటు పలువురు, సర్పంచ్‌లు, బంజారా నాయకులు ఉన్నారు.
Also Read : జాతీయ స్టాక్ మార్కెట్లపై నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే?
Follow Us On: X(Twitter)

