కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు రాజధాని చెన్నై (Chennai) భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపి లేని వానలతో నగరంలోని పలు ప్రాంతాలు, శివాలు ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులపైకి భారీగా వరదనీరు చేరడంతో జనజీవనం స్తంభించింది. వర్షాల కారణంగా విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వర్ష బీభత్సంతో లోతట్టు ప్రాంతాల పరిస్థితులు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
భారీ వర్షాల (Chennai Rains) నేపథ్యంలో తమిళనాడు సర్కార్ అలర్ట్ అయింది. బాధిత ప్రజలకు సహాయం అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 220కి పైగా సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాలతో వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
Also Read : జాతీయ స్టాక్ మార్కెట్లపై నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే?
Follow Us On: Youtube

