కలం, వెబ్ డెస్క్ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) ముగిపు దిశంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అమెరికా – రష్యా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయన్న సంకేతాల వేళ రష్యా అధినేత పుతిన్ (Putin) సంచలన ప్రతిపాదన చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్ తో యద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump), చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (Xi Jinping)లతో చర్చించేందుకు పుతిన్ ప్రతిపాదించినట్లు సమాచారం.
నవంబర్ 18, 19 తేదీల్లో చైనాలోని షెన్జెన్లో జరగనున్న ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (APEC) సదస్సు సందర్భంగా ఈ త్రైపాక్షిక సమావేశం ఉండే అవకాశం ఉందని నివేదికలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనకు చైనా అధ్యక్షుడు అంగీకారం తెలిపాడని, ట్రంప్ ఇంకా స్పందించలేదని తెలుస్తోంది. అయితే, ఈ సమావేశంపై రష్యా ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

