నేడు ఫ్యూచ‌ర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ప్రారంభించనున్న సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ ను మరింత అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ పనులు వేగవంతంగా అయ్యాయి. ఈ మేరకు సోమవారం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఫ్యూచర్ సిటీలో పర్యటించనున్నారు. ఈ మేరకు పోలీస్ అధికారులు సీఎం టూర్ కి సంబంధించి అన్ని ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నంలో మధ్యాహ్నం 3.30 గంటలకు నూతనంగా నిర్మించిన ఫ్యూచర్‌సిటీ (Future City) పోలీస్ కమిషనరేట్‌ను  సీఎం ప్రారంభించనున్నారు.

అనంతరం సాయంత్రం 5.30 గంటలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కిల్ వర్సిటీ (YISU) అభివృద్ధి పనులను పరిశీలించి పలు సూచనలు చేయనున్నారు. అలాగే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్ మెంట్ (ఎన్‌ఐయూఎం) క్యాంపస్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమాల అనంతరం ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్‌పై, భవిష్యత్ కార్యాచరణపై సీఎం (Revanth Reddy) ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

Also Read : పుతిన్ సంచలన ప్రతిపాదన.. ట్రంప్, జిన్‌పింగ్‌తో త్రైపాక్షిక భేటీకి ప్లాన్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>