ఏపీకి వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు!

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు వాతావరణ శాఖ చల్లటి కబురు (Weather Update) అందించింది. ద్రోణి ప్రభావంతో నేడు (సోమవారం) పలు జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ప్రధానంగా కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వార్షాలు పడే అవకాశం ఉంది.

పోలవరం, గుంటూరు, పశ్చిమగోదావరి, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు సహ పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మరోవైపు, ఏపీలోని మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ద్రోణి ప్రభావంతో (Weather Update) వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే ఛాన్స్ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>