కలం, నిర్మల్ : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ రూరల్ మండలం ఎల్లపెల్లి గ్రామంలో ప్రతిష్ఠించిన దుర్గామాత అమ్మవారిని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran Reddy) దంపతులు ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. కుంకుమార్చన విశిష్టతను పూజారులు భక్తులకు వివరించారు. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. రైతులు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజల జీవితాల్లో సంతోషం, శాంతి వెల్లివిరియాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అల్లోల మురళీధర్ రెడ్డి, అల్లోల సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

