బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే ఏలేటికి ఆహ్వానం

కలం, నిర్మల్: ఖానాపూర్ మండలం సూర్జాపూర్ గ్రామంలోని శ్రీశ్రీశ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy)ని ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ మేరకు ఎమ్మెల్యేను కలిసి ఉత్సవాల ఆహ్వానాన్ని ఆదివారం అందజేశారు. ఈ నెల 22వ తేదీ గురువారం నుంచి 28వ తేదీ వరకు వారం రోజులపాటు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉత్సవాలకు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యేను కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>