కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ముత్యం రెడ్డి

కలం, నిర్మల్: దిలావర్‌పూర్ మండల కేంద్రానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు దొడ్డికింది ముత్యం రెడ్డి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా (BJP Kisan Morcha) రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో బీజేపీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ముత్యం రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించా. కిసాన్ మోర్చా ద్వారా రైతుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాథోడ్, జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం చంద్రకాంత్, గుండంపల్లి గ్రామ సర్పంచ్ తక్కల రమణారెడ్డి, నాయకుడు జమాల్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>