దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం

కలం, నిర్మల్: దసరా పండుగను పురస్కరించుకుని నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి తెలిపారు. పట్టణంలోని వినాయక్ సాగర్, మహాలక్ష్మి ఆలయ పరిసరాల్లో చేపట్టిన ఏర్పాట్లను కౌన్సిలర్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దసరా రోజున వినాయక్ సాగర్ వద్ద దుర్గామాత విగ్రహాల నిమజ్జనం కోసం క్రేన్‌తోపాటు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

మహాలక్ష్మి ఆలయం వద్ద నిర్వహించే శమీ పూజ, రావణ దహన కార్యక్రమాలను ప్రజలు ఇబ్బందులు లేకుండా వీక్షించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరిసర ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు అమర్చడంతోపాటు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పెండం శ్రీనివాస్, శ్రీరామోజీ నరేష్, లక్కాకుల హరీష్, మాజీ కౌన్సిలర్ తోట నర్సయ్య, ఆలయ కమిటీ చైర్మన్ తాళ్ల రాజు, మాజీ చైర్మన్ కుడుకల గంగాధర్, విశ్వహిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>