టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

క‌లం, వెబ్‌డెస్క్‌: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) కారుపై ముంబైలోని జుహూ ప్రాంతంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కాల్పులు జరిపారు. పుష్ప పార్క్ వద్ద ఓ ప్రోగ్రామ్‌లో పాల్గొని టైగ‌ర్‌ కారులో బయలుదేరుతుండగా ముగ్గురు దుండగులు ఒక్కసారిగా ఏడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ షాకింగ్ ఘ‌ట‌న‌లో కారు అద్దాలు పగిలి డ్రైవర్ ఫిర్దోష్ ఎడమచేతికి బుల్లెట్ గాయమైంది. హీరోను చూసేందుకు దగ్గరలో నిలబడిన యోగేష్ చవాన్ అనే అభిమాని కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు స్పష్టం చేశారు. గాయపడిన డ్రైవర్‌ను, అభిమానిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ముంబై పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులను వెంటనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కాగా, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన అనిల్ పండిత్, హర్మాన్ సంధు అనే వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు. సల్మాన్ ఖాన్‌తో సంబంధాలు కలిగి ఉన్నందుకే టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ముంబై క్రైమ్ బ్రాంచ్, జుహూ పోలీసులు 15 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>