కరీంనగర్‌లో బతుకమ్మ జోష్.. అంబరాన్నంటిన సంబరాలు

కలం, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ (Saddula Bathukamma) వేడుకలు ఘనంగా జరిగాయి. అశేష జనవాహిని మధ్య సంబరాలు అంబరాన్ని అంటాయి. చివరి రోజైన సద్దుల బతుకమ్మ రోజున పులిహోర, దద్దోజనం, కొబ్బరి సద్ది, నువ్వుల సద్ది వంటి రకరకాల ‘సద్దులు’ (నైవేద్యాలు) అమ్మవారికి సమర్పించి వాయనాలు ఇచ్చుకున్నారు.

భక్తిశ్రద్ధలతో పూజించిన గౌరమ్మను (పసుపుతో చేసిన అమ్మవారు) తీసుకుని, బతుకమ్మలను సమీపంలోని చెరువులు, కుంటలు, నీటి వనరుల్లో నిమజ్జనం చేశారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం శ్రీ మహాశక్తి ఆలయంలో(Mahashakti Temple) దుర్గాదేవి (మహాగౌరీ) అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన గౌరీదేవిని చూసిన భక్తులు పరవశించిపోయారు. వేలాది మంది భక్తుల రాకతో మహాశక్తి ఆలయం కిటకిటలాడుతోంది. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం మహాశక్తి ఆలయానికి విచ్చేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌తో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన పొన్నంకు పూజారులు ప్రత్యేక ఆశీర్వచనం అందించారు.

మరోవైపు సాయంత్రం మహాశక్తి ఆలయ ప్రాంగణంలో ఘనంగా ‘సద్దుల బతుకమ్మ’వేడుకలు నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలకు భారీ ఎత్తున మహిళలు తరలివచ్చారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మను తీసుకొచ్చి కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయ పద్ధతిలో ఆడుతూ పాడుతూ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>