మారనున్న పాక్ జెర్సీ.. పింక్ డ్రెస్‌లో బాబర్ సేన!

క‌లం, స్పోర్ట్స్‌: పాకిస్థాన్ (Pakistan) క్రికెట్ జట్టు తమ సాంప్రదాయ పచ్చ జెర్సీని పక్కనబెట్టి గులాబీ రంగు డ్రెస్‌లో మైదానంలోకి దిగనుంది. అక్టోబర్ 25న ఇంగ్లాండ్‌తో జరిగే నాల్గవ వన్డేలో పాక్ ఆటగాళ్లు ఈ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. రొమ్ము క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఈ నిర్ణయం తీసుకుంది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ ప్రత్యేక పోరులో పాక్ జట్టుతో పాటు ఇంగ్లాండ్ ఆటగాళ్లు, నిర్వాహకులు కూడా పింక్ రిబ్బన్లు ధరించనున్నారు.

స్టేడియంలోని పిచ్ స్టంప్స్ కూడా గులాబీ రంగులోనే రూపోందించారు. మ్యాచ్ జరిగే సమయంలో పెద్ద స్క్రీన్లపై వ్యాధి నివారణ మెసేజ్ ప్రదర్శిస్తారు. ప్రత్యక్ష ప్రసారంలో కామెంటేటర్లు ఈ వ్యాధి ముందస్తు గుర్తింపు ప్రాధాన్యతను వివరిస్తారు. సోషల్ మీడియా వేదికగా ఆటగాళ్ల వీడియోలతో డిజిటల్ ప్రచారం కూడా సాగనుంది. అభిమానుల కోసం ప్రత్యేక పింక్ షర్టులను పీసీబీ అందుబాటులోకి తెచ్చింది. మ్యాచ్ ప్రారంభానికి ముందే స్టేడియంలో అవగాహన స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి. క్రీడల వేదికగా సామాజిక మార్పు కోసం పీసీబీ చేపట్టిన ఈ ప్రయత్నం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>