పులివెందులలో ఘర్షణలు.. 562 మందిపై కేసులు

కలం, వెబ్ డెస్క్: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కడప జిల్లా పులివెందుల (Pulivendula) పట్టణంలో చోటు చేసుకున్న ఘటనలో ఏకంగా 562 మందిపై పోలీసులు కేసులు నమోదు చేయడం గమనార్హం. వీరిలో ఎక్కువ మంది వైసీపీకి చెందినవారుగా తేలింది. నామినేషన్ కేంద్రాల వద్ద ఘర్షణకు దిగడం, రాళ్లు రువ్వడంతో పాటు కొంత మంది పోలీస్ సిబ్బందిపై దాడులకు పాల్పడటంపై ఆయా సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శనివారం నాడు పులివెందులలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది.

ఎన్నికల కమిషనర్ ఆరా..

నామినేషన్ల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘర్షణలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆరా తీశారు. ఐజీలు, డీఐజీలు, ఎస్పీలతో సమీక్ష చేశారు. అల్లర్లకు పాల్పడినవారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచాలని సూచించారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>