రాజర్షి షా గూడను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం: కలెక్టర్

కలం, ఆదిలాబాద్ : రాజర్షి షా గూడ గ్రామాన్ని అన్ని రకాల మౌలిక వసతులతో జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Rajarshi Shah) అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ రూరల్ మండలం రాజర్షి షా గూడ గ్రామంలో నూతనంగా ఏర్పాటైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఆదిలాబాద్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి, సకాలంలో వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందాలని తెలిపారు. కొత్తగా ఏర్పాటైన రెడ్ క్రాస్ సొసైటీ తన తొలి సేవా కార్యక్రమాన్ని రాజర్షి షా గూడలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో నిర్వహించే ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తామని తెలిపారు.

వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులు, వైద్యులు, రెడ్ క్రాస్ స్వచ్ఛంద కార్యకర్తలను కలెక్టర్ అభినందించారు. తన పేరును గ్రామానికి పెట్టినందుకు రాజర్షి షా గ్రామస్థులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. రహదారులు, నివాసాలు తదితర సౌకర్యాలను మెరుగుపరుస్తూ రాజర్షి షా గూడను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>