ఏపీలో హోరాహోరీగా స్థానిక సమరం.. ముగిసిన కీలక ఘట్టం!

కలం, వెబ్ డెస్క్ : ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల (AP Municipal Elections) నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కాసేపటి క్రితం ముగిసింది. చివరి రోజు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలలో అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు, ఇతర వర్గాల ప్రతినిధులు తమ మద్దతుదారులతో తరలివచ్చి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. చివరి రోజున నామినేషన్ కేంద్రాల వద్ద కోలాహలం నెలకొనడంతో అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

కాగా, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం స్వీకరించిన నామినేషన్ల పరిశీలన సోమవారం జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 21 వరకు గడువు ఇచ్చారు. పోటీలో ఉండే తుది అభ్యర్థుల జాబితాను ఉపసంహరణ ముగిసిన వెంటనే వెల్లడించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 28న పోలింగ్ నిర్వహించి, అక్టోబర్ 30న ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలను వెల్లడించనున్నారు. ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూసేందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. నామినేషన్ల ప్రక్రియలో అధికార టీడీపీ, విపక్ష వైసీపీ పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోగా.. నామినేషన్ల ప్రక్రియ పూర్తవ్వడంతో ఇక అభ్యర్థులు ప్రచార పర్వంలోకి దిగనుండటంతో ఏపీలో రాజకీయం మరింత వేడెక్కనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>