కలం, వెబ్ డెస్క్ : “పండగకు ఇద్దరు కూతుళ్లను సంతోషంగా ఊరికి తీసుకెళ్దామనుకున్నా.. కానీ ఇప్పుడు పెద్ద కూతురి మృతదేహాన్ని తీసుకెళ్తున్నా” అంటూ నాదర్ గుల్ ఎంవీఎస్ఆర్ కాలేజీ (MVSR College) ప్రమాద బాధితురాలి తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుటుంబంలో ఆరని విషాదం నిండిందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
తన ఆవేదనను వ్యక్తపరుస్తూ.. “కాలేజీలో భారీ ఈవెంట్ నిర్వహించారు. అంత పెద్ద కార్యక్రమం చేపట్టినప్పుడు సరైన ఏర్పాట్లు, భద్రతా చర్యలు తీసుకోవాలి కదా? ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా ఈవెంట్ నిర్వహించి నా కూతురి ప్రాణాలు పోయేలా చేశారు. ఈ ప్రమాదంలో నా పెద్ద కూతురు చనిపోయింది. చిన్న కూతురి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది” అని చెప్పారు.
ఇంత పెద్ద దారుణం జరిగినా ఎంవీఎస్ఆర్ కాలేజీ (MVSR College) యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం వచ్చి పరామర్శించే బాధ్యత కూడా తీసుకోలేదని ఆవేదన చెందారు. కాలేజీ నిర్లక్ష్య వైఖరి వల్లే తన ఇద్దరు కూతుళ్ల భవిష్యత్తు పూర్తిగా నాశనమైందని కన్నీటి పర్యంతమయ్యారు.
Also Read : ప్రభాస్ ఫ్యాన్స్కు పండగే.. ‘స్పిరిట్’ కొత్త పోస్టర్!
Follow Us On: Youtube

