హైదరాబాద్ మెట్రోపై ఆర్థిక భారం

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro)పై రోజురోజుకు ఆర్థిక భారం అధికంగా మారుతోంది. ఎల్అండ్‌టీ నుంచి మెట్రో ఫేజ్–1 స్వాధీన ప్రక్రియలో జరుగుతున్న ఆలస్యమే ఇందుకు ప్రధాన కారణం. గత ఆరు నెలలుగా ఈ ప్రక్రియ నిలిచిపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు కొండల్లా పేరుకుపోతున్నాయి. రోజుకు సుమారు రూ.2.85 కోట్ల చొప్పున రూ.522 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు, మెట్రో నిర్వహణ కూడా అంత లాభదాయకంగా ఉండటం లేదు. గత ఆరు నెలల్లో ఆదాయం రూ.524 కోట్లు ఉంటే.. ఖర్చులు రూ.930 కోట్లకు చేరాయి. అంటే రూ.405 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. వచ్చే నెలల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.

వడ్డీ రేటును తగ్గించేందుకు ప్రయత్నాలు..

మెట్రో ఫేజ్–1 నిర్మాణం కోసం ఎల్‌అండ్‌టీ పెద్ద ఎత్తున రుణాలను తీసుకుంది. ఇందుకు కనీసం 8 శాతం వడ్డీ చెల్లిస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే మెట్రోను టేకోవర్ చేసుకుని.. ఆ వడ్డీలను తానే చెల్లించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. సీఎస్ సంజయ్ జాజు పలుమార్లు ఫైనాన్స్ ఏజెన్సీలతో చర్చలు జరుపుతున్నారు. ఫేజ్–1 కొలిక్కి వస్తే.. వడ్డీ రేట్లను 4 శాతానికి తగ్గించుకోవాలని భావిస్తోంది. అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం కొంత తగ్గనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>