కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం కాకరేపుతోంది. తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) ఏపీ హైకోర్టు తలుపు తట్టింది. నామినేషన్ల దాఖలు ప్రక్రియను అడ్డుకుంటున్న నేపథ్యంలో అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరుతూ వైఎస్సార్సీపీ నేతలు ఈ హౌస్మోషన్ పిటిషన్ (YSRCP Petition)ను దాఖలు చేశారు.
అభ్యర్థులు స్వేచ్ఛగా, ఎటువంటి భయందోళనలు లేకుండా నామినేషన్లు వేసేందుకు వీలుగా అన్ని జిల్లాల్లో ప్రత్యేకం నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటిషన్లో స్పష్టం చేశారు. కొన్ని చోట్ల ప్రతిపక్ష అభ్యర్థులపై దాడులు జరుగుతున్నాయని, ప్రతిపాదన పత్రాలు దాఖలు చేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని వారు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ హౌస్మోషన్ పిటిషన్(YSRCP Petition)ను స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం నేడు సమగ్ర విచారణ జరపనుంది. నామినేషన్ ప్రక్రియ నిష్పాక్షికంగా జరిగేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ తరఫు న్యాయవాదులు కోరనున్నారు. ఈ విచారణ అనంతరం అమరావతి ధర్మాసనం ఇచ్చే ఉత్తర్వులు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారనున్నాయి.
Also Read : ఏపీ మున్సిపోల్స్.. రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
Follow Us On : WhatsApp

