కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తిరుపతిలో మేయర్ స్థానానికి పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థులు వినూత్నంగా నామినేషన్ (Tirupati Mayor Nomination) దాఖలు చేశారు. నామినేషన్కు అవసరమైన డిపాజిట్ మొత్తాన్ని చిల్లర నాణేల రూపంలో తీసుకువచ్చారు. ఇందుకోసం గోనె సంచుల్లో రూ.1, 2 నాణేలను తీసుకువచ్చినట్లు సమాచారం.
ఈ ఘటనతో నామినేషన్ కేంద్రంలోని అధికారులు ఆశ్చర్యపోయారు. దీంతో నామినేషన్ (Tirupati Mayor Nomination) ప్రక్రియ ఆలస్యం అవుతుందని అధికారులు వాళ్లను వరుస క్రమంలో ఉంచారు. చిల్లర నాణేలను లెక్కపెట్టడానికి సిబ్బందిని కేటాయించారు. అయితే, ఈ చిల్లర నాణేలను ఎవరు తీసుకొచ్చారు, వాటి మొత్తం ఎంత అనే వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

