కలం, వెబ్ డెస్క్ : కోల్కతా నగరంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చోర్బగాన్ దుర్గా పూజా పండల్ వద్ద భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఈ రద్దీ కారణంగా ఒక్కసారిగా తొక్కిసలాట (Durga Puja Stampede) జరిగింది.
ఈ ప్రమాదం(Durga Puja Stampede)లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరవై ఐదు మందికి పైగా గాయపడ్డారు. వర్షం కురుస్తున్న సమయంలో పండల్ బయట వేచి ఉన్న భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకురావడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది. తొక్కిసలాటలో కొందరు కిందపడిపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే విపత్తు నిర్వహణ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను వెంటనే కోల్కతా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీ జనసందోహాన్ని నియంత్రించడంలో అధికారుల వైఫల్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూజా ఉత్సవాల్లో ఇలాంటి ఘటన జరగడం దిగ్భ్రాంతిని కలిగించింది.
Also Read : పండుగలు వస్తే బాదుడేనా.. ఆర్టీసీ చార్జీలపై హరీశ్ ఫైర్
Follow Us On: X(Twitter)

