కలం, సారంగాపూర్ : మతాలు వేరైనా.. మనుషులంతా ఒక్కటేనని చాటుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ ఆది మతసామరస్యానికి (Interfaith Harmony) ప్రతీకగా నిలిచారు. సారంగాపూర్ మండలం మలక్ చించోలి గ్రామంలో దుర్గామాత మండపం వద్ద ఆయన అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసి ఆప్యాయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పండుగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడంతో పాటు మతసామరస్యాన్ని బలోపేతం చేస్తాయని తెలిపారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని పిలుపునిచ్చారు. దుర్గామాత మండపం వద్ద అన్నదానం నిర్వహించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

