విషాదం.. రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి మృతి

కలం, మునుగోడు : రోడ్డు ప్రమాదంలో గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీపతి అంజయ్య (46) మృతి చెందారు. తన సొంత గ్రామం నల్లగొండ (Nalgonda Accident) జిల్లా నిడమనూరు మండలం చిన్నారెడ్డిగూడెం గ్రామానికి చెందిన అంజయ్య, చండూరు మండల పరిధిలోని పుల్లెంల గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇతని వృత్తికి దగ్గరగా ఉన్నందున నల్లగొండలోని నివాసం ఉంటున్నాడు. శనివారం సాయంత్రం హాలియా నుంచి నల్లగొండకు బైక్‌పై వెళ్తుండగా, మార్గమధ్యలో మెడికల్ కళాశాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. విధి నిర్వహణలో భాగంగా స్థానికులతో సన్నిహితంగా మెలిగిన అంజయ్య ఆకస్మిక మరణవార్తతో పుల్లెంల గ్రామంలో విషాదం నెలకొంది.

అంజయ్య మృతిపట్ల చండూరు మండల ఎంపీడీవో యాదగిరి, మండలంలోని గ్రామపంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, పుల్లెంల గ్రామ ప్రజలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు. అంజయ్య ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు పలువురిని కలచివేశాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>