నిరుపేదలకు అండగా మాజీ ఎంపీపీ.. కోట్ల భూమి దానం!

కలం, నల్లగొండ : ‘సొంతిల్లు అనేది ప్రతీ పేదవాడి కైలాస కల.. ఆ కలను నెరవేర్చడమే నిజమైన మానవ సేవ’ అని మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచ్ రేగట్టే నిర్మల నరసింహారెడ్డి నిరూపించారు. నడిచే దారిలో ఎదురయ్యే నిరుపేదల కష్టాలను చూసి చలించిన ఆమె, వారి నివాస స్థలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ తన ఉదారతను చాటుకున్నారు. చెరువుగట్టు ( Cheruvugattu) గ్రామానికి చెందిన 30 నిరుపేద కుటుంబాలకు తన సొంత పట్టా వ్యవసాయ భూమి నుంచి ఏకంగా 2,400 చదరపు గజాల స్థలాన్ని భూదానంగా కేటాయించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ దానంలో భాగంగా ఒక్కో పేద కుటుంబానికి 80 గజాల చొప్పున ఇళ్ల స్థలాలను కేటాయించి, వాటికి సంబంధించిన పత్రాలను శనివారం లబ్ధిదారులకు అందజేశారు.

కేవలం స్థలం ఇవ్వడమే కాకుండా.. ఆయా స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు కూడా తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని రేగట్టే నిర్మల నరసింహారెడ్డి భరోసానిచ్చారు. నిరుపేదల సంక్షేమానికి, వారి ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తూ ఆమె తీసుకున్న ఈ నిర్ణయం పట్ల చెరువుగట్టు గ్రామస్థులు, లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. ఈ రోజుల్లో అంగుళం భూమి కోసం గొడవలు పడే పరిస్థితుల్లో, కోట్లాది రూపాయల విలువైన సొంత భూమిని నిరుపేదల కోసం దానం చేయడం సామాన్యమైన విషయం కాదని కొనియాడారు. పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న రేగట్టే నిర్మల నరసింహారెడ్డి దంపతులకు చెరువుగట్టు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>