హుస్నాబాద్‌ నుంచి కబడ్డీ క్రీడాకారులుగా సత్తా చాటాలి: మంత్రి పొన్నం

క‌లం, మెద‌క్ బ్యూరో: హుస్నాబాద్ నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి కబడ్డీ అకాడమీ మంజూరు ఎంతో దోహదపడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి, వారికి సరైన శిక్షణ, అవసరమైన సదుపాయాలు కల్పించడం ద్వారా రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులను తయారు చేయవచ్చని ఆకాంక్షించారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి కబడ్డీ అకాడమీ మంజూరు కావడం పట్ల హుస్నాబాద్ క్రీడా అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కబడ్డీ క్రీడాకారులు ఎదిగి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకుని, క్రీడా రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ కోచ్ కృష్ణను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించి సత్కరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>