కలం, అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఉప్పునుంతల (Uppununthala) మండలం తాడూరు గ్రామంలో ఓ రైతు ప్రభుత్వ అధికారిపై సంచలన ఆరోపణలు చేశారు. తనకు వారసత్వంగా వస్తున్న భూమిని పట్టా చేయకుండా అదే మండల తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారి తన బంధువులకు పట్టా చేసుకున్నాడని ఆరోపించారు. రైతు గుండెమోని వెంకటయ్య, రమేష్లు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పునుంతల మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏఎస్ఓ (అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్)గా విధులు నిర్వహిస్తున్న అధికారి సాయిబాబు బాధిత రైతుకు తెలియకుండా అక్రమంగా తనకు వరసకు అత్త అయిన జబ్బు నారమ్మ పేరిట భూమార్పిడి చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పలుమార్లు ప్రజావాణి ద్వారా ఉప్పునుంతల తహసీల్దార్ , అచ్చంపేట ఆర్ డీ ఓ,సీసీఎల్ లో ఫిర్యాదులు ఇచ్చిన నేటికి ఫలితం దక్కలేదని వాపోయారు. ఈ నెల 14న అచంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో కూడా మళ్లీ ఫిర్యాదు చేశానన్నారు. న్యాయం కోసం ప్రతి రోజు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. సోమవారం ఉదయం అచ్చంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరాహారదీక్ష కుటుంబ సభ్యులతో కలిసి నిరాహార దీక్ష చేస్తానని గుండెమోని రమేష్ తెలిపారు.

