శీతల్ టార్గెట్ స్వర్ణం.. ఆసియా పారా గేమ్స్‌కు సిద్ధం

కలం, స్పోర్ట్స్: ఆసియా పారా గేమ్స్‌ 2026లో (Asian Para Games 2026) మరోసారి స్వర్ణ పతకమే లక్ష్యంగా భారత పారా ఆర్చర్‌ శీతల్ దేవి(Sheetal Devi) బరిలోకి దిగుతోంది. గత పోటీల్లో సాధించిన విజయాలు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చినప్పటికీ, గత రికార్డుల గురించి ఆలోచించకుండా ఈసారి తన ప్రదర్శనపైనే దృష్టి సారిస్తున్నట్లు ఆమె స్పష్టం చేసింది. 19 ఏళ్ల శీతల్ దేవి కశ్మీర్‌కు చెందిన ఆర్చర్‌. గతంలో హాంగ్‌జౌలో జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో వ్యక్తిగత విభాగంతో పాటు రాకేశ్ కుమార్‌తో కలిసి మిక్స్‌డ్ విభాగంలోనూ స్వర్ణ పతకాలు సాధించింది. సరితా దేవితో కలిసి మహిళల డబుల్స్‌లో రజతం గెలుచుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.

ఈసారి జపాన్‌లో జరిగే పోటీల కోసం శీతల్ సాధనను మరింత ముమ్మరం చేసింది. రోజువారీ షూటింగ్‌తో పాటు శారీరక దృఢత్వంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ప్రేక్షకుల శబ్దాల మధ్య సాధన చేయడంతో పాటు, అనూహ్యంగా ఎదురయ్యే నిర్ణయాత్మక షూట్‌ఆఫ్‌లను కూడా ప్రాక్టీస్‌లో భాగం చేసుకుంది. ఒత్తిడిలోనూ లక్ష్యాన్ని గురి తప్పకుండా చేధించేందుకు సిద్ధమవుతోంది. గతంలో స్వర్ణాలు సాధించిన క్రీడాకారిణిగా పోటీల్లో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానని శీతల్ తెలిపింది. అయితే, టైటిల్‌ను నిలబెట్టుకోవాలనే ఒత్తిడిని తీసుకోకుండా తన ప్రదర్శనపై మాత్రమే దృష్టి పెడుతున్నట్లు పేర్కొంది.ఈసారి భారత బృందం తొమ్మిది క్రీడాంశాల్లో 168 మంది అథ్లెట్లతో ఆసియా పారా గేమ్స్‌లో పాల్గొంటోంది. గత ఎడిషన్‌లో భారత్‌ 108 పతకాలు సాధించింది. ఈసారి కూడా మెరుగైన ప్రదర్శనతో పతకాల సంఖ్యను పెంచుకోవాలని భారత బృందం లక్ష్యంగా పెట్టుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>