కలం, స్పోర్ట్స్: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియన్స్ (AB de Villiers) షాకింగ్ కామెంట్స్ చేశాడు. కోహ్లీ చాలా ఆరొగెంట్గా, ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండేవాడని చెప్పాడు. తొలిసారి కోహ్లీని చూసినప్పుడు తనకు అదే అనిపించిందని, కానీ వయసుతో అతని వ్యక్తిత్వం మారిందంటూ ఏబీ వివరించాడు. అయితే అది కోహ్లీపై తనకు కలిగిన తొలి అభిప్రాయం మాత్రమేనని వివరించాడు. ప్రఖర్ గుప్తాతో పాడ్కాస్ట్లో మాట్లాడిన డివిలియర్స్.. కోహ్లీ చిన్న వయసులో చాలా ఆత్మవిశ్వాసంతో ఉండేవాడని చెప్పాడు. ఆత్మవిశ్వాసాన్ని కొన్నిసార్లు అహంకారంగా పొరబడతారని, తన విషయంలోనూ అదే జరిగిందని వివరించాడు.
ఈ విషయంలో కోహ్లీ కూడా తనతో ఏకీభవిస్తాడని అభిప్రాయపడ్డాడు. 19 నుంచి 21 ఏళ్ల వయసులో కోహ్లీ (Virat Kohli) తన సామర్థ్యంపై ఎంతో నమ్మకంతో ఉండేవాడని డివిలియర్స్ (AB de Villiers) పేర్కొన్నాడు. క్రికెట్లో గొప్ప విజయాలు సాధించాలంటే తనపై తనకు నమ్మకం ఉండాలని తెలిపాడు. వయసు పెరిగేకొద్దీ కోహ్లీ మరింత పరిణతి సాధించాడని డివిలియర్స్ చెప్పాడు. తనను తాను నిరూపించుకోవాలనే తపన తగ్గడంతో అతడి వ్యక్తిత్వంలోనూ మార్పు వచ్చిందని వివరించాడు. ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించే తీరులోనూ కాలక్రమేణా మార్పు కనిపించిందని పేర్కొన్నాడు.
Also Read : లతా రెడ్డిగా కీర్తి సురేశ్.. బర్త్డే లుక్ అదిరిందిగా..!
Follow Us On: Youtube

