‘షోయబ్ ఉల్లా ఖాన్ జయంతి’ అధికారికంగా నిర్వహించాలి: ముజీబ్

కలం, కరీంనగర్: కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో శనివారం రోజున బీజేపీ మైనార్టీ మోర్చా మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ ముజీబ్ (MD Mujeeb) ఆధ్వర్యంలో ప్రముఖ పాత్రికేయుడు, అమరవీరుడు షోయబ్ ఉల్లా ఖాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మైనార్టీ మోర్చా మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్ షోయబ్ ఉల్లా ఖాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన (MD Mujeeb) మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తన కలాన్నే ఆయుధంగా చేసుకుని అక్షర పోరాటం చేసిన ధైర్యశాలి, మహనీయుడు షోయబ్ ఉల్లా ఖాన్ అని కొనియాడారు. ప్రజల స్వేచ్ఛ, హక్కుల కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన ఆయన పోరాట పటిమ నేటి తరానికి ఎంతో ఆదర్శనీయమని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వీరుడు, నిర్భయ జర్నలిస్ట్ షోయబుల్లాఖాన్ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మైనార్టీ మోర్చా ప్రతినిధులు, సమీయుల్లా అహ్మద్, మొహమ్మద్ సైద్, అబూబకర్, ఫయాజ్ చిస్తి, సర్దార్, మహమ్మద్ ఆతీఫ్, అమీర్, రౌఫ్ తదితరులు కార్యకర్తలు పాల్గొని అమరవీరుడు షోయబ్ సేవలను గుర్తుచేసుకున్నారు.

Also Read : కొంగరలో భూ సర్వే పూర్తి.. పొంగులేటి కీలక ప్రకటన

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>