కలం, వెబ్డెస్క్: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో (AP Local Body Elections) ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిలో సీట్ల పంపకాలు పూర్తయినా, ఆయా పార్టీల్లో నాయకులు కేటాయింపుల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని స్థానాల్లో బహిరంగంగానే నేతలు ఆందోళనలకు దిగుతున్నారు. ఇప్పటికే తిరువూరు, సాలూరు, ఏలూరులో వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు తాజాగా నర్సీపట్నం (Narsipatnam)లో జనసేన నాయకురాలు టీడీపీకి బిక్ షాకిచ్చింది.
పొత్తులో భాగంగా నర్సీపట్నం మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని టీడీపీకి కేటాయించారు. పార్టీ తరఫున అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి ఇక్కడ పోటీ చేయనున్నట్లు అధిష్టానం ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంపై స్థానిక జనసేన నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో తాము కూడా బరిలోకి దిగనున్నట్లు రెబల్ అభ్యర్థులు ప్రకటించారు. నేడు చింతకాయల పద్మావతి నామినేషన్ వేశారు. ఈరోజే జనసేన తరఫున నర్సీపట్నం (Narsipatnam) మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా అద్దేపల్లి సౌజన్య నామినేషన్ వేయడం స్థానికంగా హాట్ టాకిప్గా మారింది. చైర్పర్సన్ అభ్యర్థితో పాటు 15 మంది జనసేన రెబల్స్ పోటీలో ఉన్నారు. దీనిపై జనసేన అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
Also Read : ఏపీని సౌత్ బీహార్గా చేసేస్తున్నారు.. షర్మిల విమర్శలు
Follow Us On : WhatsApp

