‘ఆదర్శ కుటుంబం’ నుంచి మరో మ్యూజికల్ ట్రీట్..

కలం, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న, క్రేజీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’(Aadarsha Kutumbam) సినిమా నుంచి మరో మ్యూజికల్ ట్రీట్‌కు రంగం సిద్ధమైంది. ఈ చిత్రంలోని రెండో పాట (Second Single) ‘మాల’ను అక్టోబర్ 19న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రంలో క్యూట్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌‌‌గా నటిస్తుండగా.. నారా రోహిత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ‘నారాయణమ్మ’ సాంగ్ చాట్ బస్టర్ కావడంతో సెకండ్ సింగల్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. షూటింగ్ డిలే కారణంగా ‘ఆదర్శ కుటుంబం’ మూవీ రిలీజ్ వరుసగా వాయిదా పడుతూ వస్తుంది. త్వరలోనే మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>