హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: బీజేవైఎం

కలం, భైంసా: తెలంగాణ యువతకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేవైఎం (BJYM) నాయకులు విమర్శించారు. యూత్ డిక్లరేషన్‌లో ప్రకటించిన రూ.4 వేల నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, రాజీవ్ యువ వికాసం పథకం అమలు వంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో శనివారం భైంసా (Bhainsa) పట్టణంలోని రాజునగర్ దుర్గామాత మండపం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలులో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు కొండ సాయి ప్రసాద్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిందే గంగాప్రసాద్, నాయకులు గణేష్, విష్ణు, ఓబీసీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>