నిజామాబాద్ బస్టాండ్‌లో ‘బేటీ బచావో.. బేటీ పడావో’పై అవగాహన కార్యక్రమం

కలం, నిజామాబాద్ బ్యూరో: బాలికల రక్షణ, విద్య, మహిళల భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు నిజామాబాద్ బస్టాండ్‌లో ‘బేటీ బచావో.. బేటీ పడావో’ కార్యక్రమాన్ని (Beti Bachao Beti Padhao Programme) నిర్వహించారు. మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖకు చెందిన జిల్లా మహిళా సాధికారత కేంద్రం (DHEW) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా ‘బేటీ బచావో.. బేటీ పడావో’ లోగోతో పాటు అత్యవసర సమయాల్లో ఉపయోగపడే హెల్ప్‌లైన్ నంబర్ల వివరాలతో కూడిన హ్యాండిల్స్‌ను నిజామాబాద్ బస్టాండ్‌ (Nizamabad Bus Stand) బస్సుల్లో అమర్చారు.

మహిళలు, బాలికలు ఎదుర్కొనే సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు ఆపద సమయంలో అందుబాటులో ఉన్న సహాయ సేవలను వినియోగించుకునేలా ప్రజలను చైతన్యపరచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. డిపో మేనేజర్ వెంకటరమణ, జిల్లా సంక్షేమ అధికారి సౌందర్య, అర్బన్ సీడీపీఓ విజయలక్ష్మి, డిపో అసిస్టెంట్ ఇంజినీర్ వసుంధర, జిల్లా మిషన్ కోఆర్డినేటర్ స్వప్న చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి సౌందర్య మాట్లాడుతూ.. బాలికలకు రక్షణ కల్పించడం, విద్యలో సమాన అవకాశాలు అందించడం, మహిళల భద్రతపై సమాజంలో అవగాహన పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్‌లైన్ నంబర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>