కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో కలిసి కవ్వంపల్లి ప్రత్యేక పూజలు

కలం, కరీంనగర్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో (Mahashakti Temple) శనివారం ఆధ్యాత్మిక సందడి నెలకొంది. మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ (MLA Kavvampally Satyanarayana) ఆలయాన్ని సందర్శించి మహాశక్తి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే కవ్వంపల్లి ఆలయానికి చేరుకున్నారు.

అక్కడికి వచ్చిన ఆయనకు బండి సంజయ్ (Union Minister Bandi Sanjay Kumar)సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నాయకులు కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేదోక్త సంప్రదాయాల నడుమ అమ్మవారికి పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. పండుగ వాతావరణంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెంట వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, గోపు మల్లారెడ్డి, జువ్వాడి మన్మోహన్ రావు, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, రేవెల్లి రాజలింగం, రేమిడి శ్రీనివాస్ రెడ్డి, తమిశెట్టి రాజేష్, రామినేని రమణయ్య, కనకం అశోక్, రాపాక రాజేశ్వర్, కుంభం చిరంజీవి, కొత్తిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మందల సంపత్ రెడ్డి, ముక్కెర సతీష్ కుమార్, ఏ. రామాంజనేయులు, దూలం వీరస్వామి, విశ్వనాథుల వీరకుమార్, గుడాల మహేందర్ తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>