మ్యాగీ తిని నిద్రపోయారు: ఉదయానికి విగతజీవులుగా మారారు!

కలం, వెబ్ డెస్క్​ : నోయిడాలోని రబుపురా ప్రాంతంలో గల నగలా శ్రీ పదం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి (Noida family death) చెందడం తీవ్ర కలకలం రేపింది. ఆర్థిక ఇబ్బందులు ఆకలి కేకల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన అందరినీ కలచివేసింది.

ముప్పై ఏడేళ్ల మహేష్, ఆయన భార్య లలిత, ముగ్గురు పిల్లలు లడ్డు, మిష్టి అలాగే సాక్షాత్ విగతజీవులుగా పడిఉన్నారు. ప్రాథమిక విచారణలో ఫుడ్ పాయిజనింగ్ కారణం కావచ్చునని అనుమానిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకున్నారనే చర్చ కూడా స్థానికంగా వినిపిస్తోంది. అసలు నిజాలు నిగ్గు తేల్చేందుకు పోలీసులు కేసును అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.

మహేష్ కుటుంబం కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. ఇంట్లో తినడానికి తిండి కూడా లేకపోవడంతో రాత్రి సమయంలో అందరూ మ్యాగీ తిని నిద్రపోయినట్లు ఇటివలి సమీపవాసులు చెబుతున్నారు. ఉదయం పూట ఎటువంటి కదలిక లేకపోవడంతో అనుమానం వచ్చి ఇంటకి వెళ్లి చూడగా అందరూ శవాలై కనిపించారు. పోలీసులు ఈ టనపై దర్యాప్తు జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>