కలం, వెబ్ డెస్క్: కడప జిల్లా పులివెందుల (Pulivendula) పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా, వెనక్కి తగ్గలేదు. దీంతో గాల్లోకి ఆరు రౌండ్లు కాల్పులు జరపడం కలకలం రేపింది. నామినేషన్ వేసేందుకు వస్తుంటే టీడీపీ నేతలు తమను బలవంతంగా అడ్డుకున్నట్లు వైసీపీ అభ్యర్థులు ఆరోపించారు.
ఇరు వర్గాల మధ్య మాటామట పెరగడంతో ఒకరినొకరు దాడి చేసుకునే వరకు వెళ్లారు. ప్రస్తుతానికి పరిస్థితి పూర్తి స్థాయిలో అదుపులో ఉందని పోలీస్ అధికారులు తెలిపారు. అటు కడప (Kadapa) జిల్లా కేంద్రంలో కూడా ఘర్షణలు జరిగాయి. కాగితాలపెంట నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ మాజీ డిప్యూటీ మేయర్ కుమారుడు మురద్ భాషాపై కొందరు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయనతో పాటు మరో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
Also Read : క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి నేనున్నానంటూ కేటీఆర్ భరోసా
Follow Us On: X(Twitter)

