క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి నేనున్నానంటూ కేటీఆర్ భరోసా

కలం, ఖమ్మం బ్యూరో : బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 13 ఏళ్ల బాలుడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అండగా నిలిచారు. అధునాతన వైద్యం అందించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇస్తూ బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నరసింహులగూడెం గ్రామానికి చెందిన కర్నె ఆదినారాయణ, అనిత దంపతుల 13 ఏళ్ల కుమారుడు కర్నె వినయ్ (Karnе Vinay) గత కొంతకాలంగా ప్రాణాంతకమైన బ్రెయిన్ క్యాన్సర్‌(Brain Cancer)తో పోరాడుతున్నాడు.

ఒకవైపు బిడ్డ తీవ్ర అనారోగ్యంతో మృత్యువుతో పోరాడుతుంటే, మరోవైపు నిరుపేద కుటుంబమైన ఆ తల్లిదండ్రుల వద్ద వైద్యం కోసం అవసరమైన డబ్బు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.  బిడ్డను కాపాడుకోవడానికి పడుతున్న వారి ఆవేదన ఎంతో హృదయవిదారకరంగా మారింది. ​ఈ పరిస్థితుల్లో బాలుడి దీనస్థితిని గుర్తించిన మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కందాల ఉపేందర్ రెడ్డి… శనివారం బాధిత కుటుంబాన్ని వెంటబెట్టుకుని వెళ్లి కేటీఆర్‌ ను కలిశారు. ఈ సందర్భంగా బాలుడి ఆరోగ్య పరిస్థితిని, కుటుంబ దైన్యస్థితిని కేటీఆర్‌కు వివరించారు.

​స్పందించిన కేటీఆర్ (KTR) బాధిత కుటుంబానికి నేరుగా ధైర్యం చెప్పారు. “ధైర్యంగా ఉండు వినయ్.. భయపడకు, నేను నీకు అండగా ఉంటాను. నీకు మెరుగైన, అత్యుత్తమ వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం” అంటూ వారికి భరోసా కల్పించారు. ​కేటీఆర్ అందించిన ఈ మానవతా స్పందన, మాటల భరోసా ఆ నిరుపేద కుటుంబానికి కొండంత బలాన్నిచ్చింది. తమ బిడ్డ ప్రాణాలను కాపాడుకునేందుకు కేటీఆర్ అండగా నిలవడంతో తల్లిదండ్రులు, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : ఇంటర్నెట్ పొందడం ప్రాథమిక హక్కు: సుప్రీం కోర్టు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>