పాలపిట్టను బంధిస్తే కేసులు.. అటవీ శాఖ హెచ్చరిక

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట (Palapitta)ను బంధించిన, దసరా మండపాల వద్ద ప్రదర్శనకు ఉంచిన కేసులు తప్పవని అటవీ శాఖ హెచ్చరిస్తోంది. దసరా నేపథ్యంలో పాలపిట్టపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రకటన విడుదల చేసింది. దసరా సంప్రదాయం ప్రకారం, పాలపిట్టను చూస్తే మంచి జరుగుతుందని నమ్మకం. ఇదే క్రమంలో కొందరు వ్యక్తులు పాలపిట్టలను బంధించి సొమ్ము చేసుకోవాలని కూడా ప్రయత్నించిన ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పోస్టర్ల ద్వారా అటవీ శాఖ ప్రచారం చేపట్టింది.

పాలపిట్ట శాస్త్రీయ నామం ఇండియన్ రోలర్. వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకారం రక్షించాల్సిన పక్షి. అంతేగాకుండా వేగంగా అంతరించిపోతున్న పక్షుల జాబితాలో కూడా పాలపిట్ట ఉంది. ఈ నేపథ్యంలో దీని సంరక్షణకు కొన్నాళ్లుగా అటవీ శాఖ కృషి చేస్తోంది. పలు అటవీ కేంద్రాల్లో వీటి సంఖ్యను పెంచేందుకు శాస్త్రీయ పద్దతుల ద్వారా చర్యలు చేపట్టింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>