ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత

కలం, సినిమా: ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు దేవా (Music Director Deva) కన్నుమూశారు. 35 ఏళ్ల కెరీర్‌లో తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 400 సినిమాలకు సంగీతం సమకూర్చారు. రజినీకాంత్ నటించిన భాషా, అన్నామలై, ముత్తు వంటి బ్లాక్ బస్టర్ మూవీలతో పాటు ఎందరో స్టార్ హీరోలకు హిట్ సాంగ్స్ అందించారు. దేవా అసలు పేరు దేవనేసన్ చొక్కలింగం. 1950లో జన్మించిన ఆయన బాల్యం నుంచే సంగీతంపై మక్కువ పెంచుకున్నారు. అనేక ఆల్బమ్స్ రూపొందించారు. 1986లో ‘మాట్టుకార మన్నారు’ మూవీతో సంగీత దర్శకుడిగా మారారు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. ‘వైకాసి పోరంతాచు’ మూవీతో తమిళనాడుతో తనకంటూ పేరు తెచ్చుకున్నారు.

తెలుగులోనూ సూపర్ హిట్స్..

తెలుగులో కూడా దేవా 11 చిత్రాలకు సంగీతం అందించారు. వీటిలో పవన్ కళ్యాణ్​ నటించిన తొలి ప్రేమ, మెగాస్టార్ చిరంజీవి మాస్టర్, కింగ్ నాగార్జున ఆటో డ్రైవర్, జూనియర్ ఎన్టీఆర్ నాగ చిత్రాలు ఉన్నాయి. తొలి ప్రేమలో ఆయన (Music Director Deva) అందించిన మెలోడీ సాంగ్స్ ఇప్పటికీ ఆల్ టైం ఫేవరేట్‌గా నిలిచాయి. మాస్టర్ మూవీలో చిరంజీవితో ‘తమ్ముడు అరె తమ్ముడు..’ అంటూ పాడించిన పాట అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. 2010లో చివరగా కారా మజాకా మూవీకి సంగీతం ఇచ్చారు. రజినీకాంత్ తనకు ఎంతో ఇష్టమైన నటుడు అని చెప్పే దేవా.. భాషా మూవీ కోసం కేవలం పది నిమిషాల్లో పాటను రూపొందించి ఆశ్చర్యపరిచారు. 75 ఏళ్ల దేవా మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

Also Read : కావ్య–అనిరుధ్ పెళ్లి.. రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>