యువకుల రేసింగ్ సరదా.. ఒకరి ప్రాణం తీసింది!

కలం, వెబ్ డెస్క్​ : మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్ లో యువకుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది (Mahabubnagar Accident). యూపీఎస్ స్కూల్ సమీపంలో థార్ కార్లతో రేసింగ్ నిర్వహిస్తూ ఒక కుటుంబం ప్రయాణిస్తున్న బైక్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో షహానా బేగం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

బంధువుల వివాహ వేడుక ముగించుకుని కుటుంబంతో కలిసి వస్తున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాద తీవ్రతకు బైక్ నడుపుతున్న భర్త షాకీర్ కాళ్లు, చేతులు విరిగి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. అదృష్టవశాత్తూ తల్లి ఒడిలో ఉన్న వారి చిన్నారి కుమార్తె ఆయారా స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.

ఘటన అనంతరం ఒక కారు అక్కడి నుంచి పరారవగా, స్థానికులు మరో కారును వెంబడించి పట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. పరారైన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Also Read : ఇక్కడ కన్నీటి హారతులు.. అక్కడ జలహారతులు: హరీశ్ రావు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>