కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూల పండుగ బతుకమ్మ వేడుకలు హైదరాబాద్ నగరం అంబర్పేటలో (Amberpet Bathukamma) వైభవం గా జరగనున్నాయి. ఈసారి వేడుకల్లో భాగంగా ఆసియాలోనే అతిపెద్దదిగా భావించే 72 అడుగుల భారీ మహా బతుకమ్మను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల టన్నుల కొద్దీ రంగురంగుల పూలతో ఈ అద్భుత ఆకృతిని రూపొందించడం ఇక్కడి వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
కేంద్రమంత్రి జి. కిషన్రెడ్డి నాయకత్వంలో ఈ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అంబర్ పేట మున్సిపల్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఈ వేడుకకు భారీ సంఖ్యలో ఆడపడుచులు, ప్రజలు తరలిరానున్నారు. ఈ మహోత్సవానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. వేడుకలు విజయవంతం చేసేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.

