ఈ నెల 22 నుండి పత్తి కొనుగోళ్లు : రాజర్షి షా

కలం, ఆదిలాబాద్: పత్తి కొనుగోళ్లు ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్నట్లు భారతీయ పత్తి కార్పొరేషన్ వెల్లడించిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Rajarshi Shah) శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పత్తి విక్రయించేందుకు రైతులు ముందస్తుగా ‘కపాస్ కిసాన్ యాప్’ ద్వారా స్లాట్‌లను బుక్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అక్టోబర్ 22న పత్తి విక్రయించేందుకు సంబంధించిన స్లాట్‌లను అక్టోబర్ 17, 2026 నుంచి రోలింగ్ ప్రాతిపదికన బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు తమ పత్తిని విక్రయించేందుకు ముందస్తుగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>