కరీంనగర్ మహాశక్తి ఆలయానికి పోటెత్తిన భక్తులు

కలం, కరీంనగర్ బ్యూరో: దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయం (Karimnagar  Mahashakti Temple)లో 6వ రోజైన శుక్రవారం రోజు మూలా నక్షత్రం సరస్వతి దేవీ (కాత్యాయనీ) అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు శ్రీ మహాశక్తి ఆలయానికి క్యూ కట్టారు. భవానీ భక్తులు ఒకవైపు, విద్యార్థుల అక్షరాభ్యాసం, పుస్తకాల పూజ మరోవైపు… వెరసి మహాశక్తి ఆలయం జ్ఝాన సరస్వతి నిలయంగా మారిపోయింది. చదువుల తల్లి జ్ఝాన సరస్వతి దివ్య దర్శనంతో భక్తుల మనుసులు పులకించిపోయాయి.

భవానీ దీక్షలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చదువుల తల్లి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుల్లారావు యాదవ్ తోపాటు పలువురు ప్రముఖులు బండి సంజయ్ తోపాటు మహాశక్తి అలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

జ్ఞానజ్యోతులు వెలిగించే జగన్మాత..

అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే చదువుల తల్లి సరస్వతీదేవి ఆరాధనకు మూలా నక్షత్రం అత్యంత విశిష్టమైనది. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహాశక్తి ఆలయంలో కొలువైన అమ్మవారిని సరస్వతీదేవి రూపంలో దర్శించుకుని భక్తులు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, కళాకారులు, సాహితీవేత్తలు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించి జ్ఞానం, వివేకం, ఏకాగ్రత ప్రసాదించాలని ప్రార్థించడం విశేషం.

అంగరంగ వైభవంగా పల్లకీ సేవ..

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ మహాశక్తి ఆలయంలో శుక్రవారం సాయంత్రం అమ్మవారి పల్లకీ సేవ అంగరంగ వైభవంగా కొనసాగింది. అధ్యాత్మిక ప్రవచనాలు ఒకవైపు… సరస్వతి దేవీని కీర్తిస్తూ చిన్నారులు, మహిళలు న్రుత్యాలు మరోవైపు వెరసి భక్తులను కనువిందు చేశాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఆద్యంతం పల్లకీ సేవలో తరించారు.

ప్రత్యేక డ్రెస్ కోడ్ తో దాండియా..

దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయం లో నిర్వహించే దాండియా కార్యక్రమానికి వేలాది మంది భక్తులు, ముఖ్యంగా యువతీ యువకులు హాజరై ఆధ్యాత్మిక ఆటపాటలతో చిందులేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. నిర్వాహకుల విజ్ఝప్తి మేరకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ధరించి ‘దాండియా’కు హాజరై నృత్యాలు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>