పండుగలు మత సామరస్యానికి ప్రతీకలు : సయ్యద్ హైదర్

కలం, నిర్మల్: మత సామరస్యానికి పండుగలు ప్రతీకలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హైదర్ అన్నారు. అన్ని మతాల వారు కలిసిమెలిసి పండుగలు జరుపుకున్నప్పుడే సమాజంలో నిజమైన ఐక్యత, సోదరభావం వెల్లివిరుస్తాయన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి వాడలో శుక్రవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ఆయన అన్నదాతగా విరాళం అందించారు.

ఈ సందర్భంగా భక్తులతో కలిసి స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించి తన సేవాభావాన్ని చాటుకున్నారు. పండుగల వేళ అన్నదానం చేయడం, భక్తులకు సేవలందించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బైండ్ల శ్రీనివాస్, వసంతరావు, మెరుగు రాజన్న, రాజమణి, రవి, సోషల్ వర్కర్ సాజిద్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>