కలం, నిర్మల్ : జిల్లా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో భారత జనాభా గణన -2027 సిబ్బందికి అధికారులు శిక్షణ కార్యక్రమం (Census Training Programme) చేపట్టారు. మున్సిపాలిటీ, తహసీల్దార్ కార్యాలయాల్లోని చార్జ్ క్లర్క్ లు, టెక్నికల్ అసిస్టెంట్లకు జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం రెండవ దశ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సంబంధిత జనగణన సిబ్బందికి వివిధ అంశాల్లో క్షుణ్ణంగా శిక్షణ ఇచ్చారు. జనగణన ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండి, ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక అధికారి గంగారెడ్డి, డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్ తెలంగాణ డి.వి. రమణ, ఇతర అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.

