కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్పేట్ సబ్స్టేషన్లో నూతన ఫీడర్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో శనివారం విద్యుత్ సరఫరా లో అంతరాయం ఉంటుందని ఏడీఈ శ్రీనివాస్ రావు శుక్రవారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అగ్రికల్చర్ మార్కెట్ ఏరియా, మోచి గల్లీ, బుధవార్పేట్, గాంధీ చౌక్, కబూతర్ కమాన్, బంగల్పేట్, నాయుడువాడ, బోయివాడ, రాంరావుబాగ్, సాయిబాబా ఆలయ ప్రాంతం, నందిగుండం దుర్గామాత ఆలయ పరిసరాలు, విశ్వనాథ్పేట్, వైఎస్సార్ కాలనీ, గాజులపేట్, డాక్టర్ లేన్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారుడు సహకరించాలని కోరారు.

