భద్రతకు సీసీ కెమెరాలు.. పోలీసుల సూచనలు

కలం, యాదగిరిగుట్ట: ప్రజల భద్రతకు సీసీటీవీ కెమెరాలు(CCTV Cameras) కీలకమని, నేరాల నియంత్రణతో పాటు ఘటనలకు సంబంధించిన ఆధారాల సేకరణలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని పోలీసు అధికారులు పేర్కొన్నారు. యాదగిరిగుట్ట మండలంలోని మాసాయిపేట ఎస్సీ కాలనీలో (Masaipet SC Colony) శుక్రవారం సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, మరమ్మతులపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా భద్రతను పెంపొందించుకోవచ్చని ప్రజలకు వివరించారు. కెమెరాల ఏర్పాటు, సాంకేతిక లోపాల పరిష్కారం, మొబైల్ ఫోన్ ద్వారా ప్రత్యక్ష పర్యవేక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ యాదయ్య, పోలీసు సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>