18న నిర్మల్​ లో శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపన.. ఎమ్మెల్యేకు ఆహ్వానం

కలం, నిర్మల్ : నిర్మల్‌ (Nirmal) జిల్లా కేంద్రంలోని నాయుడువాడ కాలనీలో శ్రీ గుట్ట వీరన్న అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 18న మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించి, బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ కార్యక్రమానికి విశ్వహిందూ పరిషత్‌ అఖిల భారత సహ కార్యదర్శి, గోరక్ష విభాగం అఖిల భారత ప్రముఖ్‌ ఆకారపు కేశవరాజు ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు వెల్లడించారు. హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమం అనంతరం అన్నదానం నిర్వహించనున్నట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>