కలం, బోనకల్ : మధిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బోనకల్ మండలంలో ఈ నెల 17న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్నాటి రామకోటేశ్వరరావు (Bonakal Congress) పిలుపునిచ్చారు.
శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కర్నాటి రామకోటేశ్వరరావు మాట్లాడుతూ.. మధిర నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, కాంగ్రెస్ ప్రజా పాలనలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. శ్రేణులందరూ సమన్వయంతో వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పైడిపల్లి కిషోర్ కుమార్, మండల నాయకులు ఎర్రం శెట్టి సుబ్బారావు, పాసంగులపాటి కోటేశ్వర రావు, సర్పంచ్ బద్రు నాయక్, కందుల పాపారావు, పవన్ తదితరులు పాల్గొన్నారు.

